beggers

బిచ్చం అడిగినందుకు అరెస్ట్..ఆ వివరాలు ఏంటి?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అక్కడి పోలీసులు.. బిచ్చం అడుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. భోపాల్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అతను వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ.. బిచ్చం అడుగుతున్నాడు. ఇది గమనించిన ఓ పౌరుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ బిచ్చం ఎత్తుకునే వ్యక్తిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఇంతలా కఠినంగా వ్యవహరించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే భిక్షాటన నిరోధక చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఎవరైనా బిచ్చం అడగడం, బిచ్చం వెయ్యడం రెండూ నేరమే. ఈమధ్య అదే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఓ గుడి ముందు అడుక్కుంటున్న యాచకురాలికి ఓ వ్యక్తి బిచ్చం వెయ్యడంతో.. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్‌ 223 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Related Posts
వారణాసిలో అంగన్వాడీ స్కామ్: 40 యువతులను గర్భిణిలుగా నమోదు
pregnancy shape size 2021 722x406 1

వారణాసి జిల్లాలో ఒక అంగన్వాడీ కార్మికురాలు చేసిన దుర్వినియోగం పెద్ద సంచలనం సృష్టించింది. సుమన్‌లత అనే అంగన్వాడీ కార్మికురాలు గ్రామంలోని కొన్ని యువతుల ఆధార్ కార్డుల ఫోటోకాపీలు Read more

మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం
Manmohan Singh funeral procession begins

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఉద‌యం 11.45 గంట‌ల‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ Read more

వంతారాలో పులి పిల్లలను ఆడిస్తున్న ప్రధాని
PM Modi is playing with tiger cubs in Vantara

అహ్మదాబాద్‌: వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సందర్శించారు. ప్రధాని మోడీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం Read more

త్రిభాషా విధానం అవసరం
sudhamurthi

భారతదేశం లాంటి బహుభాషా సమాజంలో విద్యార్థులు మూడుకు పైగా భాషలు నేర్చుకోవడం మంచిదేనని సుధా మూర్తి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు స్థానిక భాషతో పాటు హిందీ, ఆంగ్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *