టాలీవుడ్ యాక్టర్ కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం “అర్జున్ S/o వైజయంతి” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మాస్ యాక్షన్ డ్రామాలో తన నటనతో ఆకట్టుకోబోతున్నారు.ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ చిత్రం వచ్చే వారం (ఏప్రిల్ 18) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
టీజర్
10 సంవత్సరాల నా కెరీర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతీసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. నెక్స్ట్ బర్త్ డే నాటికి పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కొడుకుని కోరుతుంది. కాని లాఠీ చేతపట్టాల్సిన అర్జున్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టుకొని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజర్ లో చూపించారు.టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యేలా కట్ చేశారు. అయితే హీరోయిన్ ను పూర్తిగా సైడ్ చేశారు. విజయశాంతి చెప్పిన డైలాగ్స్ చూస్తే ఆమెకి కొడుకు అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, ఎమోషన్స్, సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది.సినిమాపై బోలెడన్ని అంచనాలు పెంచేసింది టీజర్.
ఆశీర్వచనాలు
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని కళ్యాణ్ రామ్ టీం తిరుమలేశుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా,వేద పండితులు చిత్రయూనిట్‌కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అభిమానులు ఆలయ ప్రాంగణంలో విజయశాంతి, కళ్యాణ్‌రామ్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీం తిరుమల సందర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also: Jack Movie :జాక్ మూవీపై నెటిజన్లు ఏమంటున్నారంటే..