ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు, పట్టణాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే శాశ్వతంగా కాదు. తాత్కలికంగా సచివాలయ ఆన్‌లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. మరో మూడు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని ఆ తర్వాత సచివాలయ సేవలు(Secretarial services)తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అనగా జూన్ 10, మంగళవారం నాటి రాత్రి వరకు గ్రామ, వార్డు సచివాలయ సేవలను నిలిపివేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కారణమేంటంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ఏపీ సేవ పోర్టల్‌ను మైక్రోసాఫ్ట్ అజార్ క్లోడ్ నుంచి రాష్ట్ర డేటా సెంటర్‌కు తరలిస్తుంది. ఈ డేటా మార్పిడి ప్రక్రియ వల్ల నాలుగు రోజుల పాటు అనగా జూన్ 7 నుంచి 10 మంగళవారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ సేవలను(Online services) తాత్కలికంగా నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించుకోవాలని తెలిపారు.గ్రామ, వార్డు సచివాలయాలల్లో ఈ నాలుగు రోజుల పాటు తాత్కలికంగా రేషన్, రైస్ కార్డులు, ఆదాయ, వృద్ధాప్య, మ్యారేజ్, నివాస స్థలం ధ్రువీకరణ పత్రాల మంజూరు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, మ్యూటేషన్లు, పట్టణ పరిపాలనకు సంబంధించిన సేవలు ఇలా మొత్తం పది ఆన్‌లైన్ సర్వీసులకు అంతరాయం కలగనుంది. ఇక్కడ పేర్కొన్న సేవలు తప్ప మిగతా అన్ని సర్వీసులు మీసేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

అందుబాటులో ఉంటాయని
అయితే డేటా మార్పిడి కార్యక్రమ ప్రభావం, అన్ని ప్రభుత్వ సేవలపై పడదని అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా ఆధార్ అప్‌డేట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ సేవలు, నాన్-రెవెన్యూ ఆధారిత సేవలు,ఇలాంటివన్ని మీసేవా కేంద్రాల్లో(Meeseva centers) రోజువారి మాదిరే అందుబాటులో ఉంటాయని తెలిపారు.సచివాలయాల్లో తాత్కలికంగా సేవలు నిలిపివేస్తున్న నేపథ్యంలో ప్రజలు దీనికి అనుగుణంగా నడుచుకోవాని సూచించారు. త్వరలోనే సేవలను మళ్లీప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం https://ap.gov.in/ లేదా గ్రామ సచివాలయం అధికారిక పోర్టల్స్‌ను సందర్శించాలని సూచించారు.
Read Also: Inter Students: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్