ఏప్రిల్ 12, 2025న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాలు రాష్ట్ర విద్యా రంగంలో కొత్త ఉత్సాహం నింపాయి. గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగడం, అమ్మాయిలే ప్రతీ గ్రూపులోనూ పైచేయి సాధించడం విశేషం.

అమ్మాయిల విజయ గాధ
ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్‌లో అమ్మాయిలు 75 శాతం, అబ్బాయిలు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌లో అమ్మాయిల విజయోత్సాహం మరింత స్పష్టమైంది — 86 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిలను (80 శాతం) మించిన స్థాయిలో నిలిచారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రదర్శన మెరుగ్గా ఉండటం పాజిటివ్ ట్రెండ్‌కు సంకేతం. మొత్తం 10,17,102 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తే వారిలో పస్ట్ ఇయర్‌లో 4,87,295 మంది పరీక్ష రాస్తే 3,42,979 మంది ఉత్తీర్ణత పొందారు. ఇక సెకండియర్‌లో 4,22,030 మంది పరీజోరాస్తే వారిలో 3,51,521 (80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో అమ్మాయిలు 75 శాతం, అబ్బాయిలు 66 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్‌లో అమ్మాయిలు 86 శాతం, అబ్బాయిలు 80 శాతం చొప్పున ఉత్తీర్ణత పొందారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఫస్ట్ ఇయర్‌లో 50,314 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 23,799 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో 39,783 మందికిగానూ 27,276 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతమే మెరుగ్గా ఉండటం విశేషం. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా 70%, 81% చొప్పున ఉత్తీర్ణత నమోదై రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అయితే హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థల్లో ఇంటర్ ఫస్టియర్‌లో కేవలం 34 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్‌కు సంబంధించి 60 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఈసారి ఫలితాలపై విద్యాశాఖ మంత్రి, ఇంటర్మీడియట్ బోర్డు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని మరిన్ని విద్యా వనరులు అందజేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇటీవలి ఫలితాలు విద్యార్థుల్లో స్పష్టమైన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విజయవంతమైన ప్రదర్శన గర్విం చదగ్గ విషయం. గ్రూప్ వారీ ఫలిత విశ్లేషణ ఎంపీసీ గ్రూపులో-అత్యధికంగా 992 మార్కులు 11 మందికి వచ్చినా, వారిలో 8 మంది అమ్మాయిలే బైపీసీ గ్రూపులో- గరిష్ఠంగా 993 మార్కులు సాధించిన విద్యార్థి బాలిక. సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీల్లో కూడా ఎక్కువ టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం.
Read also: Nara Lokesh: వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన నారా లోకేశ్