ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా (A6) చేర్చబడ్డారు. ఈ కేసులో మొదటి నిందితురాలిగా (A1) ఆయన సతీమణి పేర్ని జయసుధ ఉన్నారు. మచిలీపట్నంలో జయసుధ పేరిట ఉన్న గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి.ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ రిలీఫ్ దక్కింది. బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని పేరును ఏ 6గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పేర్నినాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన ఏపీ హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
రేషన్ బియ్యం
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ పేరు ఏ1 గా చేర్చారు పోలీసులు. ఇదే కేసులో పేర్ని నాని పేరును 2024 డిసెంబర్ 31న ఏ 6గా చేర్చారు. ఏ1 గా ఉన్న పేర్ని జయసుధకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పేర్ని జయసుధ పేరున ఉన్న గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయమైన ఘటన కృష్ణా జిల్లాలో రాజకీయంగా చర్చకు కారణమైంది. ఉద్దేశపూర్వకంగా ఈ కేసు నమోదైందని అప్పట్లో పేర్ని నాని ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర తోసిపుచ్చారు.

ఈ కేసులో మొదటి నిందితురాలిగా (A1) ఆయన సతీమణి పేర్ని జయసుధ ఉన్నారు. మచిలీపట్నంలోని జయసుధ పేరిట ఉన్న గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నాని తనపై అరెస్టు ముప్పు ఉందని భావించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించి, తదుపరి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు నానిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో నాని భార్య జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైంది. మొత్తం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.మచిలీపట్నంలో ఉన్న పేర్ని జయసుధకు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అదే సమయంలో, నిందితులలో మానస్ తేజ్, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు ఈ కేసులో పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఆయనకు భారీ ఊరట లభించింది.