pawan tirumala laddu

సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt suspends SIT investigation

అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఈ లడ్డూ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు లడ్డూ కల్తీపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామన్నారు.

Advertisements

కాగా, గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజులుగా సీట్ అధికారులు బృందాలుగా ఏర్పడి లడ్డు కల్తీ ఫై దర్యాప్తు చేపట్టారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబరు 3) అనంతరం, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ వివరించారు.

Related Posts
ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే : హరీశ్ రావు ట్వీట్
Harish Rao Questions CM Revanth Reddy

రేవంత్ రెడ్డి ఈ రైతుకు ఏం జవాబిస్తారు? హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ Read more

ఉక్రెయిన్‌కు ATACMS క్షిపణులు: రష్యా యుద్ధంలో అమెరికా జోక్యం పెరుగుతుంది
atacmc

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో, అమెరికా ఉక్రెయిన్‌కు దీర్ఘ పరిధి క్షిపణులను (ATACMS) ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్షిపణులు రష్యా భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలను Read more

Godavari River : బనకచర్ల ప్రాజెక్ట్‌ వివరాలను దాస్తున్న ఏపీ!
Godavari River బనకచర్ల ప్రాజెక్ట్‌ వివరాలను దాస్తున్న ఏపీ!

గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) సమావేశం మరోసారి వాడివేడిగా మారింది. బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ ఆధ్వర్యంలో జలసౌధలో భేటీ జరిగింది. ఇది మూడు గంటల Read more

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు?
Caller ID ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు? సెల్‌ఫోన్ వినియోగదారులకు త్వరలోనే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే ‘సీఎన్‌ఏపీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టెలికామ్ Read more

×