సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఈ లడ్డూ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు లడ్డూ కల్తీపై…