బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

బ‌డ్జెట్‌పై జీవీ రెడ్డి ప్ర‌శంస‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూ. 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు.

జీవీ రెడ్డి ట్వీట్

“నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం వుంటాయి.తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు.

రాజకీయ ప్రస్థానం

గతంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జీవీ రెడ్డి, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు.అయితే, ఇటీవ‌ల జీవీ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పినా, చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఉన్న గౌరవం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక పరమైన సంస్కరణలు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. తక్కువ రెవెన్యూ లోటుతో అధిక వ్యయ బడ్జెట్ రూపొందించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసోపేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. 

Related Posts
AP Govt : ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల
AP govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ ఉత్సాహంగా జరగేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. Read more

వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Relief for YS Jagan in the Supreme Court

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను Read more

ఏపీలో మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు
Mid day meal menu change ex

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం (Mid-Day Meal Scheme) కింద ఉన్న వంటకాలను సమీక్షించి, మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని ముఖ్యమైన Read more

ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
AP High Court has two new j

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు కొత్త అడిషనల్ జడ్జిలను నియమించారు. అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Read more