ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఈఏపీసెట్) నోటిఫికేషన్ విడుదఐంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రకటనల విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది.

ఈఏపీసెట్ 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా..
ఈఏపీసెట్ 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏపీలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 24, 2025వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు
ఇక ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో మే 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 21 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. దరఖాస్తులకు సంబంధించిన విద్యాప్రమాణాలు, అర్హతలు, ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీలు, పరీక్షల సిలబస్ వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.
ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్
ఆర్ఆర్‌బీ రైల్వే లోకో పైలట్ సీబీటీ-II సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే
రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ- 2 పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను తాజాగా విడుదల చేసింది. రెండో విడత పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులోని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీటీ I ఫలితాలను, కట్‌ఆఫ్ మార్కులను విడుదల చేయగా అందులో మొత్తం 1,251 మంది అభ్యర్ధులు సీబీటీ-2 పరీక్షకు ఎంపికయ్యారు. సిటీ ఇంటిమేషన్ వివరాల్లో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్ నెం.9513631459 ను సంప్రందించవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. పరీక్షకు నాలుగు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. మార్చి 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.