నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం కేసులో (Liquor Dump Case) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి (Kakani Govardhan Reddy) రిమాండ్ పడింది. గురువారం పీటీ వారంట్‌పై ఆయన్ని నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీ వరకూ రిమాండ్ విధించారు.ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇది గత సార్వత్రిక ఎన్నికల నాటికి చెందినది. సర్వేపల్లి నియోజకవర్గంలోని పంటపాళెం, విడవూరు, ముత్తుకూరు ప్రాంతాల్లో 69,000 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మొదట ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

కొత్త ఫిర్యాదుతో కేసు తిరిగి తెరపైకి
పొదలకూరుకు చెందిన కూరపాటి విజయబాబు ఇటీవల ఈ కేసును తిరిగి విచారించాలని ఫిర్యాదు చేశారు. తాను దగ్గర్లో ఉన్న ఆధారాలను ఎక్సైజ్ శాఖకు సమర్పించనున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు కేసు మళ్లీ ప్రారంభించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేంద్రరెడ్డిని విచారిస్తుండగా, ఆయన కాల్ డేటాలో కాకాణితో ఎక్కువ మాట్లాడినట్లు కనిపించింది. దీంతో కాకాణిని ఏ-8 నిందితుడిగా చేర్చారు. మద్యం బాటిళ్ల పంపిణీలో ఆయన కీలక పాత్ర పోషించాడని అనుమానిస్తున్నారు.
డిపో నుంచి స్కాన్ చేసిన షాపు కోడ్లు?
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 35 మద్యం దుకాణాల్లో 25 దుకాణాల నుంచి అధిక మద్యం అమ్మకాలు జరిగినట్లు నమోదైంది. షాపు కోడ్‌తోనే డిపో నుంచి బాటిళ్లు స్కాన్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి నిర్ధారణ కోసం వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందే వైసీపీ నేతలు మద్యం నిల్వ చేశారని ఆరోపణ. ఓటర్లను ఆకర్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
Read Also : Rubber Factory : కాటేదాన్‌లో రబ్బర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం