నేపాల్ రాజధాని కఠ్మాండూ వీధుల్లో మాజీ రాజు జ్ఞానేంద్ర షా పేరు ప్రతిధ్వనిస్తోంది. ఈ పేరు 2006లోనూ అక్కడి వీధుల్లో మారుమోగింది, 2025లో మరోసారి వినిపిస్తోంది. 2006లో వీధుల్లో నిరసనకారులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ, భిన్నమైన డిమాండ్లతో రోడ్లపైకి వచ్చారు. అప్పట్లో రాచరికం అంతం కావాలని డిమాండ్ చేయగా, ఇపుడు అదే రాచరికం కావాలని కోరుతున్నారు. తాజా నిరసనలలో వందలాది మంది గాయపడ్డారు. రాచరికంతో పాటు నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ ఘటనలతో పొరుగున ఉన్న భారతదేశంపై పడే ప్రభావమేంటి ? రాచరికం తిరిగి వస్తే ఇండియాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా?

నేపాల్‌లో నిరసనలకు కారణాలు ఏమిటి?
నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. మాజీ రాజు జ్ఞానేంద్ర షా వార్షిక ప్రసంగం అక్కడి ముఖ్యాంశాల్లో నిలిచింది. నేపాల్ ప్రస్తుత పాలనా వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉంది. మెరుగైన జీవితం, ఉపాధి కోసం యువత విదేశాలకు తరలివెళుతున్నారు. దీంతో రాచరిక వ్యవస్థ మద్దతుదారులు నేపాల్‌లో మళ్లీ రాచరికం, హిందూ దేశం రావాలంటూ నిరసనలు చేస్తున్నారు.
భారత్, నేపాల్సంల మధ్య బంధాలు
“నేపాల్‌లో అశాంతి, అస్థిరత భారతదేశం కోరుకోదు” అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫెలో శివం షెకావత్ అన్నారు. “భారత్, నేపాల్ మధ్య సంబంధం పాతది. ఎవరు అధికారంలో ఉన్నారనేది పట్టింపు లేదు. రాచరికంతో మంచి సంబంధం ఉంది. గత దశాబ్ద కాలంగా పరిశీలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి.

చైనా ఈ పరిస్థితిని ఎలా చూస్తుందనే ప్రశ్నకు జర్నలిస్ట్ యువరాజ్ ఘిమిరే సమాధానమిస్తూ.. ‘నేపాల్‌కు ఒక వైపు చైనా మరోవైపు భారత్ ఉన్నాయి. దీంతో రెండు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించుకునేలా విదేశాంగ విధానం ఏర్పాటు చేసుకున్నారు’ అని అన్నారు.
Read Also: Donald Trump: తరచూ వివాదాల్లో ట్రంప్..ఆర్డర్లపై తీవ్ర వ్యతిరేకత