అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతోన్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మార్చిలో కూడా అమెరికా పర్యటనకు వచ్చిన జెలెన్‌స్కీ.. ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ సమయంలో గొడవపడి అర్థాంతరంగా చర్చల నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ సారి ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య క్రిమియా అంశంపై వివాదం తలెత్తింది. క్రిమియాను రష్యా భూభాగంగా ట్రంప్ పరిగణిస్తుంటే.. జెలెన్‌స్కీ దీనికి అంగీకరించలేదు. ఉక్రెయిన్ తన ప్రాథమిక సూత్రాలపై నిలబడుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

లండన్ వేదిక రష్యా-ఉక్రెయిన్‌పై జరుగుతోన్న చర్చల్లో అమెరికా ప్రతిపాదించిన రెండు కీలక అంశాలు మాస్కోకు అనుకూలంగా ఉన్నాయని సమాచారం. అందులో ఒకటి క్రిమియాను అధికారికంగా రష్యా ప్రాంతంగా గుర్తించడం, రెండోది ఉక్రెయిన్ ఎప్పటికీ నాటో సభ్యత్వం పొందకూడదు. అయితే, ఈ రెండు ప్రతిపాదనలను ఉక్రెయిన్ తిరస్కరించడంతో ట్రంప్ అసహనంతో స్పందించారు. కీవ్ తలవంచకుంటే చర్చల నుంచి అమెరికా వైదొలగుతుందని ట్రంప్ హెచ్చరించారు.
జేడీ వాన్స్ హెచ్చరిక
అటు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రంప్‌ను సమర్దిస్తూ.. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిచర్చలు జరగపోతే, అమెరికా పూర్తిగా వైదొలగాల్సిన సమయం వచ్చింది’ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న భూభాగ హద్దుల్లోనే యథాతథ స్థితిని కొనసాగించాలి. దీర్ఘకాలిక రాజనీతిక పరిష్కారం ద్వారా శాంతి సాధించాలి. సైనికులు రెండు వైపులా ఆయుధాలు వదిలి.. యుద్ధం నిలిపివేయడమే అసలైన పరిష్కారం’ అని JD వాన్స్ వ్యాఖ్యానించారు. వాన్స్ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్రీ యెర్మాక్ తీవ్రంగా స్పందించారు. ‘ఉక్రెయిన్ రాజ్యాధికారం, భూభాగ సమగ్రతపై స్థిరంగా నిలుస్తుంది’ అని లండన్‌లో అమెరికా ప్రతినిధికి తేల్చిచెప్పారు.
Read Also: America: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చట్టపరమైన హోదా రద్దు