Sharmila's anger over AP budget

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ కి అధిక ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3 లక్షల కోట్లు దాటిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు భారీ కేటాయింపులు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

Advertisements

సంక్షేమ పథకాలు

అన్నదాత సుఖీభవ: రైతులకు రూ. 20,000 నగదు సహాయం.
తల్లికి వందనం: ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 15,000 జమ.
ఆరోగ్య భీమా: ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా పథకం.
ఉచిత విద్యుత్: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు, చేనేత మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా.
వృద్ధాశ్రయాలు: 12 వృద్ధాశ్రమాల నిర్మాణం.
గృహ నిర్మాణం: ద్వారా 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.

బడ్జెట్ కేటాయింపులు

తల్లికి వందనం పథకం

తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమచేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

ఆరోగ్య రంగం

కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్‌లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్‌లో మంత్రి వెల్లడించారు.

ఉచిత విద్యుత్

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ కేటాయించనుంది ప్రభుత్వం.

AP Govt Super Six 8a578e7436 V jpg 625x351 4g

చేనేత మగ్గాలకు

మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అందించేలా బడ్జెట్‌లో ప్రస్తావించారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు నిర్మించాలని నిర్ణయించారు. 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు.

మత్స్యకార సంక్షేమం

చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు కేటాయించనున్నారు. అలాగే ఆదరణ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది.

Related Posts
కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి: అమర్నాథ్
Gudivada Amarnath

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితులకు ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై Read more

జగన్ నివాసం వద్ద అగ్ని ప్రమాదంపై రాజకీయ జ్వాలలు
జగన్ నివాసం వద్ద అగ్ని ప్రమాదంపై రాజకీయ జ్వాలలు

అగ్ని ప్రమాదం: వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద జరిగిన సంఘటన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద Read more

పోసాని గోరంట్లపై చర్యలు ఉంటాయి :మంత్రి అనిత
చట్టబద్ధంగా చర్యలు కొనసాగుతాయి: వంగలపూడి అనిత

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవల పోసాని కృష్ణ మురళీ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఏపీ Read more

వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Relief for YS Jagan in the Supreme Court

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను Read more

×