
అప్పుల బాధలు, వడ్డీ వ్యాపారి వేధింపులు ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన వైఎస్సార్ కడప(YSR Kadapa crime) జిల్లాలో చోటుచేసుకుంది. జీజీఎస్ తండా ప్రాంతానికి చెందిన మహేంద్ర నాయక్ (27) అనే వ్యక్తి అప్పుల ఒత్తిడిని తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి
స్థానికుల కథనం ప్రకారం
స్థానికుల కథనం ప్రకారం, మహేంద్ర నాయక్ తన ఆర్థిక అవసరాల కోసం సుధాకర్ నాయక్ అనే వ్యక్తి వద్ద నుంచి అప్పు తీసుకున్నాడు. అయితే నిర్ణీత సమయానికి అప్పు చెల్లించలేకపోవడంతో సుధాకర్ నుంచి తరచూ బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అప్పు(Loan Harassment) తీర్చకపోతే ప్రాణహాని కలిగిస్తానని భయపెట్టడంతో మహేంద్ర తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ వేధింపులే తన భర్త మరణానికి కారణమని మహేంద్ర నాయక్ భార్య ఆరోపించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పు వ్యవహారం, బెదిరింపులపై ఆధారాలు సేకరిస్తూ సుధాకర్ నాయక్ పాత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: