YCP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలక పథకాల విషయంలో ప్రభుత్వం మహిళలను వంచించిందని ఆరోపించింది.
Read Also:Andhra Pradesh: రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

₹1,500 పథకంపై ప్రతిపక్షం ట్వీట్ వార్
ప్రతి నెలా మహిళలకు ₹1,500 చొప్పున ‘ఆడబిడ్డ నిధి’ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా దానిని అమలు చేయలేదని వైసీపీ విమర్శించింది. మహిళా దినోత్సవాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప, ఆడబిడ్డల జీవితాల్లో మార్పు తెచ్చే ఏ ఒక్క వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేసింది. కేవలం ప్రచారానికే పరిమితమైన ఈ పథకం క్షేత్రస్థాయిలో అడ్రస్ లేదని ట్వీట్ చేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తోందని విమర్శించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ప్రభుత్వానికి లేదని, వెంటనే ‘ఆడబిడ్డ నిధి’ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ రాజకీయ విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: