
తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఫైనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసిందని బీజేపీ (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ (Yamini Sharma) తెలిపారు. ఈ కుంభకోణంలో మొత్తం 36 మంది ప్రమేయం ఉన్నట్లు సిట్ తన నివేదికలో పేర్కొందని ఆమె వెల్లడించారు.
Read Also: TIDCO: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో పేదలకు కొత్త ఇళ్లులు
అసలు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి, ప్రసాదాన్ని కల్తీ చేశారని సిట్ స్పష్టం చేసిందన్నారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న నాటి టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ (Yamini Sharma) నేతలు, కార్యకర్తలను హిందువులు ఎప్పటికీ మరిచిపోరని, క్షమించరని యామిని శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నీ గమనిస్తున్నారు. వారు చేసిన కర్మకు ఎలాంటి ఫలితం అనుభవిస్తారో చూద్దాం అంటూ యామిని శర్మ హెచ్చరించారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: