ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) స్విట్జర్లాండ్ చేరుకున్నారు. జనవరి 19, సోమవారం ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా, యూరప్‌లోని ప్రవాస తెలుగువారు, ఎన్నారై టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఉన్నారు.
Read Also: Bandla Ganesh: ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..

(WEF) అనంతరం జ్యూరిచ్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జ్యూరిచ్‌లో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు వారికి, ఎన్నారై టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. యూరోప్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి నా పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది,” అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: