suspicious death: విశాఖపట్నం(Vizag crime)లో ఓ యువకుడి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. అల్లూరి జిల్లా చెందిన 18 ఏళ్ల నందు(Nandu), అదే జిల్లాకు చెందిన తన 24 ఏళ్ల ప్రియురాలితో కలిసి నగరంలోని ఓ అద్దె గదిలో నాలుగు రోజులుగా నివసిస్తున్నాడు. అయితే, ఇటీవల నందు ఆ గదిలో మృతిచెందినట్లు గుర్తించారు.
Read also: UP Crime: బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో
నందు మృతికి ముందు రోజు తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో, ప్రియురాలు తన మేనమామను వివాహం చేసుకోవాలని చెబుతోందని, దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నందు మృతి సహజం కాదని, అతడిని ప్రియురాలు, ఆమె అక్క, మేనమామ కలిసి హత్య(murder) చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: