ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని(Visakha summit) దేశంలోని టెక్ మరియు ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ₹10,000 కోట్ల పెట్టుబడితో ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ ముందడుగు నెట్టింది. లోకేశ్ మాట్లాడుతూ, 2029 నాటికి రాష్ట్రంలో 20,000కి పైగా స్టార్టప్‌లు ఏర్పడి లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఇది కేవలం ఉద్యోగాలు సృష్టించడం మాత్రమే కాదు, విద్యార్థులు, పరిశ్రమలు, ప్రభుత్వ శాఖలందరికి ఇన్నోవేషన్ మైండ్‌సెట్‌ను పునరుద్ధరించడం ప్రధాన ఉద్దేశం అని ఆయన వివరించారు.
Read also: విశాఖలో గూగుల్ కి పోటీగా భారీ ఏఐ డేటా సెంటర్

స్టార్టప్‌లకు మద్దతు, 6 సంస్థలతో అవగాహన ఒప్పందాలు
ఈ ప్రణాళికకు (Visakha summit) కార్యరూపం ఇవ్వడంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలకంగా ఉంటుందని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహిస్తారని తెలిపారు. స్టార్టప్‌లకు ప్రభుత్వం మొదటి కస్టమర్‌గా వ్యవహరిస్తుంది, ప్రభుత్వ సమస్యలకు సొల్యూషన్‌ల కోసం హ్యాకథాన్‌లు కూడా నిర్వహిస్తారని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌తో పాటు UAEలోని స్టార్టప్‌లు, క్వాంటమ్ ఏఐ, ఏపీ వాగ్ వంటి సంస్థలతో 6 అవగాహన ఒప్పందాలు అయ్యాయి. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి, టాటా ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి అరోరా పాల్గొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో ఇన్నోవేషన్ కేంద్రాలను మరింత సుస్థిరంగా తీర్చిదిద్దడం, కొత్త టెక్‌నాలజీలు ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టబడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: