हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

ED inquiry : విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది, తర్వాత ఏమౌతుంది?

Sai Kiran
ED inquiry : విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది, తర్వాత ఏమౌతుంది?

ED inquiry : ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆయనను అధికారులు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసి పంపించారు.

ఈడీ జారీ చేసిన నోటీసుల మేరకు ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనను గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలైన మద్యం విధానం, లైసెన్సుల మంజూరు, విక్రయ వ్యవస్థ, నిధుల మళ్లింపు వంటి అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్రపై కూడా అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం.

Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం లైసెన్సులు, (ED inquiry) డిస్ట్రిబ్యూషన్‌లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా సుమారు రూ.3,500 కోట్ల మేర నిధులు చేతులు మారినట్టు సిట్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అదే ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఈ కేసులో విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఇతర నేతలు, మధ్యవర్తులను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870