हिन्दी | Epaper

Gannavaram Court: ఏప్రిల్‌ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్‌

sumalatha chinthakayala
Gannavaram Court: ఏప్రిల్‌ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్‌

Gannavaram Court: గన్నవరం కోర్టులో వైసీపీనేత వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేసి హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్‌ 1 వరకు వంశీకి రిమాండ్‌ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

image

ఆత్కూరు పోలీసులు కేసు నమోదు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్‌ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్‌ చేసుకున్నానని శ్రీధర్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతించటంతో మంగళవారం విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ

తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలివ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది. సంబంధిత కోర్టులోనే పరిష్కరించుకోవాలని వంశీకి సూచించింది. మెడికల్ రిపోర్టులు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలిస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీ లో గ్యాస్ నిల్వల పై చంద్రబాబు క్లారిటీ

ఏపీ లో గ్యాస్ నిల్వల పై చంద్రబాబు క్లారిటీ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేశ్

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేశ్

ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

విషాద వీచిక!

విషాద వీచిక!

అర్జున్ దాస్ కు మళ్లీ మహంతు బాధ్యతలు

అర్జున్ దాస్ కు మళ్లీ మహంతు బాధ్యతలు

రాజన్న పార్కులో వాకింగ్ ట్రాక్.. కమిషనర్ మౌర్య కీలక హామీ!

రాజన్న పార్కులో వాకింగ్ ట్రాక్.. కమిషనర్ మౌర్య కీలక హామీ!

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట వైసీపీ శాంతియుత నిర‌స‌న‌

అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట వైసీపీ శాంతియుత నిర‌స‌న‌

రంజాన్ కానుకగా రూ.45 కోట్లు విడుదల చేసిన బాబు సర్కార్

రంజాన్ కానుకగా రూ.45 కోట్లు విడుదల చేసిన బాబు సర్కార్

రేపల్లెలో ఫ్లెక్సీల చింపివేత.. సీఐకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఇన్‌చార్జ్!

రేపల్లెలో ఫ్లెక్సీల చింపివేత.. సీఐకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఇన్‌చార్జ్!

రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

📢 For Advertisement Booking: 98481 12870