వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి జూన్ 30 ఒకింత ఊరటను, ఒకింత ఉత్కంఠను ఇచ్చింది. ఎందుకంటే, ఆయనపై నమోదైన మొత్తం 10 కేసుల్లోనూ బెయిల్ లభించడంతో విడుదల మార్గం సాఫీగా కనిపించినా, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆయన బెయిల్‌ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం చర్చనీయాంశమైంది.ఏలూరు జిల్లా నూజివీడు కోర్టు (Nuzvidu Court) , నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు, వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని న్యాయస్థానం షరతులు విధించింది. ఈ కేసుతో కలిపి మొత్తం 10 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించడం అతని వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపింది.(Vallabhaneni Vamsi)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మలుపు
వంశీకి లభించిన బెయిల్‌లను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో వంశీ విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది.కింది కోర్టుల్లో ఊరట లభించినప్పటికీ, సుప్రీంకోర్టులో జరిగే విచారణలో తుది నిర్ణయం తీసుకోబడనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై వంశీ భవితవ్యం ఆధారపడనుంది.
అరెస్ట్ నుండి నేటి వరకు వంశీ ప్రయాణం
గత ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదయ్యాయి. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులపాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, కోలుకున్న తర్వాత మళ్లీ జైలుకు తరలించబడ్డారు.ఇప్పటికే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పిటిషన్ వల్ల వంశీ విడుదలపై స్పష్టత రాలేదు. రేపటి విచారణపై వంశీ వర్గం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read Also : Pashamylaram: పాశమైలారం ఘటన దురదృష్టకరం – కిషన్ రెడ్డి