విజయవాడ : నాలెడ్జి బేస్డ్ సొసైటీని తయారుచేయడంలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విద్యారంగాన్ని నడిపించే నాయకులు, సంస్కరణల అంబాసిడర్లుగా వైస్ ఛాన్సలర్లు పనిచేయాలని కోరారు. పాదయాత్ర మార్గదర్శనమన్నారు. ‘నా సుదీర్ఘ పాద యాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను నేను ప్రత్యక్షంగా కలిసి వారి ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్నాను. వారిలో చాలా మందికి సర్టిఫికెట్లు ఉన్నా, ఉన్నతవిద్య పూర్తిచేసి బయటకొచ్చినపుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.
Read also: Andhra Pradesh: ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు

Universities play a crucial role in building a knowledge society
విద్యార్థులు, యువత ప్రశ్నలకు జవాబు చెప్పేందుకే సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకున్నాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక కీలక రాజకీయ ప్రముఖుడు హెచ్ ఆర్ డి శాఖను చేపట్టటం ఇదే మొదటిసారి చూశాను అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ అభివృద్ధిపై మాకు గల నిబద్ధతకు ఇదే నిదర్శనం” అని లోకేష్ పేర్కొన్నారు. 5 అంశాలపై విసిలు దృష్టి సారించాలి: పబ్లిక్ యూనివర్సిటీల బలోపేతానికి ఉన్నత విద్యలో ఐదు అంశాలపై దృష్టి సారించాలని భావిస్తునానని మంత్రి లోకేష్ (Nara lokesh) పేర్కొన్నారు. మొదటిది: బోధన, అవసరాల మధ్య వ్యత్యాసం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు నాణ్యతా ప్రమాణాలు లేని విద్య. మన డిగ్రీలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ తక్కువగా ఉంది.
ఇటీవల నేను స్పాన్సర్డ్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లగా, స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (లీతీతి ప్రోగ్రామ్ నిర్వహించే సంస్థ) తమ మొత్తం కరికులం మార్పులు చేసింది. నేను ఎంబిఎ చేస్తున్న సమయంలో ఒకసారి మార్చారు, ఇప్పుడు మళ్లీ పూర్తిగా కొత్త పాఠ్యాంశాల రూపకల్పన చేస్తున్నారు. అందుకే కాలానుగుణంగా పాఠ్యాంశాలు పూర్తి స్థాయిలో మార్పులు చేపట్టడంపై దృష్టి పెట్టాలని వీసీలను కోరుతున్నాను. రెండో సవాలు: ఉద్యోగావకాశాలు లేని డిగ్రీలు. తగిన ఇంటర్న్ షిప్ లు, అప్రెంటిన్షిప్లు, ప్లేస్మెంట్ వ్యవస్థలు లేకపోవడంతో మనం ఇచ్చే డిగ్రీలకు విశ్వసనీయత తగ్గిపోతోంది. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం అంతంత మాత్రమే ఉండడంతో ఇది మరింత కష్టతరం అవుతోంది. మూడో సవాలు: ప్రయోజనం లేని పరిశోధనలు. పరిశోధన, ఆవిష్కరణ, జ్ఞాన ప్రభావం మధ్య వ్యత్యాసం పెరుగుతోంది.
మన సంస్థల్లో ఆవిష్కరణలు, స్టార్ట్ప్ ఎకోసిస్టమ్లు బలహీనంగా పనిచేస్తున్నాయి. నాలుగవ సవాలు: విద్యపై కన్నా అధిక సమయం పరిపాలనా అంశాలపై వెచ్చిస్తున్నారు. మన విద్యాసంస్థల్లో పాలన, నాయకత్వం, అధ్యాపక లోటు వంటి సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. ఈ సమస్యలు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కాకుండా, పాత వారసత్వ నిర్ణయాల కారణంగా వచ్చాయి. అయినప్పటికీ, మనం అకడమిక్ స్టాండర్డ్స్ పై మరింత సమయం కేటాయించాలి. ఆధ్యాపకుల సామర్థ్యాన్ని పెంచి, మన నిర్ణయాలు పాత పద్ధతులపై కాకుండా డేటా ఆధారంగా ఉండేలా చూసుకోవాలి. ఐదవ సవాలు: విద్యార్థుల అనుభవంలో సమానత్వం, నిలకడ లోపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు మార్గదర్శకత, సంక్షేమం, మానసిక మద్దతు లేమి పెద్ద సవాలుగా ఉంది.
భవిష్యత్ అవకాశాలపై దృష్టిపెట్టాలి”ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆర్థిక స్వావలంబన వైపు యూనివర్సిటీలు అడుగులు వేయడం కూడా అవసరం. మన విద్యాసంస్థలు ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రతిభను తయారు చేశాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల సిఇఓలలో మన పూర్వవిద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం దీనికి ఉదాహరణ. ఈ నెట్వర్క్ ను వినియోగించి ఆర్థిక స్వావలంబనను పెంచడం మన బాధ్యత. అదనంగా ప్రాంతీయ, సామాజిక, లింగ అసమానతలు అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలి. ఉన్నత విద్యా వ్యవస్థలో ఈ ఐదు లోపాలు ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న వీసీల సమావేశం ఈ ప్రాథమిక అంశాల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
ముఖ్యంగా యువతకు ఏది అవసరం, మనం ఏం నేర్పుతున్నాం అన్న దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పరిశ్రమలతో అనుసంధానం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. నేను వెళ్లిన ప్రతి విశ్వవిద్యాలయంలో దీన్నే ప్రాధాన్యంగా చెప్పాను. రాబోయే దశాబ్దానికి సరిపోయేలా మన లబస్ లో మార్పులు చేయాలి. ఎందుకంటే నాలెడ్జి చాలా వేగంగా మారుతోంది, రాబోయే 10 సంవత్సరాల్లో వచ్చే ఉద్యోగాలలో 80 ఇప్పటికీ తెలియని రంగాల్లో ఉండబోతున్నాయి.
ఇవే మనం ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లు” అని పేర్కొన్నారు. పాతపద్ధతులను విడనాడాలి: “ఇందుకోసం మనం యావత్ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలి. నాణ్యత కొలమానంగా విద్యార్థి ఏమి అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా ఆచరణలో పెడతాడు అనే అంశంపై దృష్టిపెట్టాలి.
పాతకాలపు పాఠాలను బోధించడం కొనసాగిస్తే. మనం సమయాన్ని వృథా చేయడం మాత్రమే కాదు… మన పిల్లలకు ద్రోహం చేసినట్లవుతుంది. అందుకే విశ్వవిద్యాలయాలు తమ పాఠ్యప్రణాళికలను నిరంతరం సమీక్షించి నవీకరించాలి. మల్టీ డిసిప్లినరీ విద్యను స్వీకరించాలి. బోధనను వాస్తవ జీవిత అవసరాలతో అనుసంధానం చేయాలి. ఇది మనందరి సామూహిక బాధ్యత. రెండవ అంశం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు, పరిశ్రమలతో అనుసంధానం. డిగ్రీలు పనికి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తీసుకురావాలి. నేను నా “పాదయాత్రలో” చూసినట్లు, మన సంస్థల నుంచి పట్టభద్రులైన విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు పొందలేకపోయినా, అమీర్ పేటలో నాలుగు నెలల శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగం పొందగలిగారు. అమీర్ పేట ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. ఇది మనం పరిష్కరించాల్సిన ప్రధాన అంశం.
ఇది విద్యార్థుల వైఫల్యం కాదు.. ఇది మన సంస్థల వైఫల్యం.. విశ్వవిద్యాలయాలు విద్య, ఉపాధి మధ్య వారధిగా మారాలి. ఇంటర్న్షిప్లు, అప్రెంటిన్షిప్లు, పరిశ్రమ ఆధారిత కోర్సులు, పూర్వ విద్యార్థుల మార్గదర్శకత్వం ప్రధాన పాత్ర పోషించాలి. మూడవ అంశం పరిశోధన, ఆవిష్కరణ, జ్ఞాన ప్రభావం. ఇది కేవలం పత్రికలలో ప్రచురణల నుండి ప్రయోజనాత్మక పరిశోధనల వైపు మారాలి. పరిశోధన అనేది విశ్వవిద్యాలయ ఆత్మ. విశ్వవిద్యాలయాలు నీటికొరత, వాతావరణ మార్పులు, వ్యసాయ ఉత్పాదకత, ప్రజారోగ్యం, పోషకాహార సవాళ్లు వంటి సమస్యలకు పరిష్కారం అందించే సంస్థలుగా మారాలి. ఆవిష్కరణలు, స్టార్ట్ప్స్, పేటెంట్లు, టెక్నాలజీ బదిలీలు విద్యా వ్యవస్థ విస్తరణకు దోహదపడాలి. నాల్గవ అంశం పాలన, నాయకత్వం, బోధకుల ప్రతిభ ప్రభావంతంగా పనిచేస్తుంది.
విద్యార్థులతో మాట్లాడండి “విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా సుస్ధిరంగా ఉండాలి, వనరులను విభిన్నంగా అభివృద్ధి చేసుకోవాలి. అల్యుమ్నీతో అనుసంధానం ఏర్పరచుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధిలో భాగం కావాలి. విద్యార్థుల అనుభవాలను పట్టించుకోని విశ్వవిద్యాలయం అది ఎంత పాతదైనా, ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా సమయానుకూలత కోల్పోతే ప్రమాదకరం. అందుకే నేను వైస్ చాన్సలర్లను ప్రతి వారం కొద్ది గంటలైనా విద్యార్థులతో నేరుగా మాట్లాడే ఓపెన్ హౌస్” కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాను. విద్యార్థులతో ఎక్కువ పరస్పర చర్చలు జరగడం అవసరం” అని లోకేష్ అభిప్రాయపడానడరు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలుగా మారాలి “ప్రపంచ స్థాయి పబ్లిక్ విశ్వవిద్యాలయాలు మన లక్ష్యం. ఇది మన గౌరవ చాన్సలర్ గారు నాకు స్పష్టంగా ఇచ్చిన మార్గదర్శకం.
నాకు ప్రపంచ స్థాయి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కావాలి.” మనం అందరం కలిసే దానిని సాధించగలం. మీ స్వతంత్రతను పరిరక్షిస్తాం, ప్రతిభను గుర్తిస్తాం. నేను మా గౌరవ చాన్సలర్ గారికి హామీ ఇస్తున్నాను. ఆయన నాయకత్వంలో మనందరం కలసి రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాలను గర్వపడేలా తయారు చేస్తాం. మన సరికొత్త ప్రయాణం ఈరోజు నుంచే ప్రారంభం కావాలి. ఇక్కడ చర్చించిన ప్రతి అంశంలో మీరు విజేతలై తదుపరి సమావేశంలో ఫలితాలు చూపాలి ” అని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: