हिन्दी | Epaper

పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!

Sudheer
పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల మధ్య డ్రోన్ ఎగరినట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నాయకులు, డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయానికి తెలపడంతో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా సమాచారమందించారు.

డ్రోన్ సంచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను రేపుతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సమయంలో విద్యుత్ విరామం కలగడంతో అంతరాయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ రావు హల్‌చల్ చేసాడు. ఇలా వరుసగా భద్రత వైఫల్యాలు వెలుగులోకి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో ఆందోళన ఎక్కువైపోతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

24×7 గ్యాస్ కష్టాలే! పల్లె నుంచి పట్టణం దాకా సామాన్యుడి హాహాకారాలు!

24×7 గ్యాస్ కష్టాలే! పల్లె నుంచి పట్టణం దాకా సామాన్యుడి హాహాకారాలు!

ఏపీలోని అంగన్వాడీలకు శుభవార్త

ఏపీలోని అంగన్వాడీలకు శుభవార్త

📢 For Advertisement Booking: 98481 12870