తిరుమల : పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసంలో రేపటి నుండి జనవరి 8వరకు పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలను భక్తులకు సౌకర్యవంతంగా కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి తెలిపారు. ముఖ్యంగా తొలి మూడు రోజులు (30, 31, జనవరి 1)రేపు, ఎల్లుండి, గురువారం వరకు ఆన్లైన్ లో టోకెన్లు అందుకున్న భక్తులను మాత్రమే ఆయా రోజుల్లో స్లాట్ సమయానికి ముందు క్యూలైన్లలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అన్ని శాఖల అదికారులు, ఉద్యోగులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడురోజులు టోకెన్లు పొందిన 1.75లక్షల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, అదనపు సౌకర్యాలు కల్పించడంలో టిటిడి విజిలెన్స్, టిటిడి (TTD) ఉద్యోగులు, పోలీసులతో సమన్వయం చేసుకున్నామన్నారు.
Read also: Telugu states: కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

TTD
భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా
ఈ ఏడాది భక్తులకు అదనంగా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించేలా స్థలాలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ మూడురోజులు టోకెన్ కలిగిన భక్తులను క్యూలైన్లలోనికి నిర్దేశిత సమయం ప్రకారం ఆయా రోజుల్లోనే అనుమతించేలా ఆదేశాలిచ్చామన్నారు. జనవరి 2నుండి 8వరకు ముక్తిద్వారం కోసం తరలివచ్చే భక్తులకు సురక్షిత దర్శనం, ప్రశాంత వాతావరణం కల్పించడంలో పోలీసులు, విజిలెన్స్ కీలక పాత్ర పోషిస్తారని అదనపు ఇఒ చౌదరి పేర్కొన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. టోకెన్లుతో మూడురోజులు దర్శనం కోసం వచ్చిన భక్తులకు సాఫీగా క్యూలైన్ల నిర్వహణ, రద్దీ ప్రాంతాల్లో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది నియామకం, భక్తుల రద్దీ చేరినా తగినట్లు సామరస్యంగా వ్యవహరించి నియంత్రించడం జరుగుతుంది.
టోకెన్ లేని భక్తులను తిరుమల పైకి అనుమతించినా ఆలయం ముందు. అఖిలాండం వరకే పరిమితం చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టామన్నారు. ఈ పదిరోజులు ప్రతి అధికారి, ఉద్యోగి, సిబ్బంది అంకితభావంతో నిబదతో సేవలందిస్తారని ఆయన తెలిపారు. ఆలయంలో భక్తులకు మహాలఘు దర్శనంలో వైకుంఠవాకిలి దర్శనం చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఆన్లైన్ లో సామాన్యభక్తులకు వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం 1.20లక్షలు టిక్కెట్లు. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనాలను వారంరోజులకు ఏడువేల టిక్కెట్లు ఆన్లైన్ లో విడుదల చేయడం జరిగిందన్నారు. వైకుంఠద్వారం తెరచి ఉంచే పదిరోజులు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టిటిడి ప్రకటించింది. తదనుగుణంగా సామాన్యభక్తులకు దర్శనాలు చేయించేలా చూస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: