తిరుమలలో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan), మంత్రి అనగాని సత్యప్రసాద్‌ల అభ్యర్థనను టీటీడీ (TTD) తిరస్కరించింది. ఈ నెల 16న పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా బయటకు వచ్చింది. కొండపై పరిమితంగా భూములు ఉండటం, కొత్త నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: AP: ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు
ఇప్పటికే ఉన్న భవనాలు కేటాయిస్తాం
కొండపై కొత్త నిర్మాణాలపై నిషేధం విధించడం మాత్రమే కాక, భూమి కొరత దీనికి తోడు హైకోర్టు ఆంక్షలు అమల్లో ఉండటంతో, టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపుకు అంగీకరించని టీటీడీ, అందుకు బదులుగా, ఇప్పటికే ఉన్న అతిథిగృహాల్లో ఈ శాఖలకు అనువైన భవనాన్ని కేటాయించాలని నిర్ణయించింది. దీనివల్ల ఆయా శాఖల అవసరాలు తీరతాయని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: