हिन्दी | Epaper
మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

TTD: లడ్డూలకు ‘కియోస్క్’!

Sharanya
TTD: లడ్డూలకు ‘కియోస్క్’!

తిరుమలలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు

బ్యాంకుల ద్వారా ఐదు యంత్రాలు అందుబాటులోకి

తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం తరువాత అంతేపవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఇకనుండి సులభంగా అందుకునేందుకు వీలుగా టిటిడి (TTD) అధికారులు “కియోస్క్” (Kiosk) యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాలను లడ్డూ వితరణశాలలో మొదట్లోనే ఏర్పాటుచేశారు. యూనియ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్ యం త్రాలను ప్రయోగాత్మకంగా ఉంచారు.

కియోస్క్ ల ద్వారా సులభంగా లడ్డులు

భక్తులు సులభంగా ఈ కియోస్క్ వద్దకు చేరుకుంటే రెండు రకాల సేవలు యంత్రం తెరపై కనిపిస్తుంది. మొదటిది దర్శన టిక్కెట్ కలిగిన భక్తులకు లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ లేని భక్తు లకు ఆధార్కార్డు ఆధారంగా లడ్డూలు అందుకునేందుకు సాంకేతికతను అమర్చారు. దీనిపై భక్తులు ఏదేని ఒకదానిని వినియోగించుకుంటే లడ్డూలకు దర్శన టిక్కెట్నంబర్గానీ, ఆధార్ కార్డునంబర్ నమోదు చేయాలి. ఆ తరువాత మొబైల్నంబర్ నమోదు చేస్తే ఎన్ని లడ్డూలు అవసరం అనేది తెరపై కనిపిస్తుంది. భక్తులు ప్రస్తుతం ప్రయోగత్మక విధానంలో ఆధార్కార్డు ఆధారంగా కేవలం 2లడ్డూలు మాత్రమే అందు కునే అవకాశం ఉంది. దర్శన టిక్కెట్ ఉంటే ఆ నంబర్ను నమోదుచేస్తే 6లడ్డూలు వరకు అందుకునే వీలుంది. ఈ విధానంలో భక్తులు చేతిలో డబ్బులు లేకున్నా కియోస్ ద్వారా యుపిఐ స్కానర్తో నగదు చెల్లింపులు జరిపి, కౌంటర్ల వద్ద నిరీక్షించే అవసరం లేకుండా లడ్డూలు పొందవచ్చు. ఆదివారం మధ్యాహ్నం నుండి ప్రయోగా త్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కియోస్క్ యంత్రాలను తక్కువ సంఖ్యలోనే భక్తులు సేవలు వినియోగించుకున్నారని టిటిడి ఆలయ వర్గాల సమాచారం.

ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగిన సమయంలో దర్శనానంతరం లడ్డూ ప్రసాదాల కోసం కూడా భక్తులు వితరణశాలలో క్యూలలో బారులు తీరడం కనిపిస్తుంది. కౌంటర్ల వద్ద అధిక రద్దీని, నిరీక్షించే సమయాన్ని తగ్గించేందుకు ఈ యంత్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. రోజుకు 80వేలమందినుండి 90వేలమంది వరకు భక్తులు కలియుగ వైకుంఠవాసుడిని దర్శించుకుంటున్నారు. ఉదయం విఐపి బ్రేక్ దర్శనాల సమయంలో మాత్రమే లడ్డూవితరణశాలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది. సర్వదర్శనం ఆర్జితసే వలు ముగిసే సమయాల్లో ఉచిత లడ్డూతో బాటు అదనపు లడ్డూలకోసం పెద్దసంఖ్యలో భక్తులు కౌంటర్లవద్ద కనిపిస్తారు. భక్తులు ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు వచ్చినపుడు అక్కడి సిబ్బంది శ్రీవారిసేవకుల సహాయంతో లడ్డులకు డబ్బులుతీసుకున్న అనంతరం లడ్డూలను అందిస్తారు. దీనివల్ల చాలావరకు ఇబ్బం దులుఎదురవుతున్నాయి. ఈ రద్దీని నియం త్రించేందుకు ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన కియోస్క్ ద్వారా రశీదు అందుకుంటే క్షణాల్లో లడ్డూలు కౌంటర్ల నుండి పొందవచ్చు.ఒక కుటుంబంలో ఐదుగురు భక్తులు దర్శనానికి వచ్చినా వీరంతా కలసి 30 వరకు లడ్డూలు అదనంగా పొందే వీలు కలుగు తుంది. ఇదేగాక ఆధార్కార్డు ఆధారంగా తీసుకునే 2లడ్డూల సంఖ్యను కూడా 4లడ్డూలకు పెం చేందుకు సాంకేతిక మార్పులు జరగనున్నాయి.

Read also: Sridhar Chamakuri : అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి అరుదైన పురస్కారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ..బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు

మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ..బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు

గద్దెలపైకి తల్లులు వచ్చేటప్పుడు గన్ ఫైరింగ్ ఎందుకు చేస్తారు ?

గద్దెలపైకి తల్లులు వచ్చేటప్పుడు గన్ ఫైరింగ్ ఎందుకు చేస్తారు ?

బంగారం చోరీ కేసులో ఫేమస్ నటుడ్ని విచారించిన SIT

బంగారం చోరీ కేసులో ఫేమస్ నటుడ్ని విచారించిన SIT

మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం

వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా చంద్రబాబు?: అంబటి

వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా చంద్రబాబు?: అంబటి

మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

📢 For Advertisement Booking: 98481 12870