TTD: కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండ ప్రాంతం జనసంద్రంగా మారింది. తిరుమలలోని అన్ని క్యూకంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి.
Read Also: Festival Guidelines:రథ సప్తమి రోజున ఇవి చేయకండి!

24 గంటల్లో సర్వదర్శనం
టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సుమారు 24 గంటల్లో సర్వదర్శనం(Sarva Darshan) కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దర్శనాల నిర్వహణను సజావుగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో, శుక్రవారం ఒక్కరోజులోనే 69,726 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 27,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లకు చేరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: