దాతల నుండి విరాళాల సేకరణకు టిటిడి అనుమతి
టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు
తిరుమల : ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగడించిన శస్త్రచికిత్సల్లో తిరుపతిలో తిరుమల తిరుపతిదేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రి (Bird Hospital) లో పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందించే దిశగా చూడాలని టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు సూచించారు. ఇందుకు దాతల నుండి విరాళాలు సేకరించాలని అధికారులకు నిర్దేశం చేశారు. బర్డ్లో పలు రకాల వైద్యసేవలకు గ్రామీణ ప్రాంత రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చైర్మన్ బర్డ్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు జగదీశ్కు సూచించారు.
బర్డ్ ఆస్పత్రి
తిరుపతి బర్డ్ ఆస్పత్రి నిర్వహణ, నిధుల సమీకరణ, అత్యుత్తమ వైద్యసేవలు, శస్త్రచికిత్సలపై సోమవారం తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలో టిటిడి ఇఒ జె.శ్యామలరావు, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, టి. జానకిదేవి, వర్చువల్గా డాక్టర్ అదితేశాయ్, జెఇఒ వీరబ్రహ్మం, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు జగదీశ్, ఎపిసిఎఒ బాలాజీ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఛైర్మన్ బిఆర్నాయుడు సమీక్షచేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ (Chairman) మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలోని బర్డ్ ఆస్పత్రిలో అవసరమైన మేరకు శస్త్రచికిత్సలను త్వరగా నిర్వహించాలని, ఈ సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా బర్డ్కు ప్రఖ్యాతలున్నాయని, గత కొంతకాలంగా బర్డ్ ఆస్పత్రి నిర్వహణ నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వెలిబుచ్చారు.

శస్త్రచికిత్సలకు
తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. బర్డ్లో వైద్యసేవలకు పేదలకు తగిన ప్రాధాన్యత నివ్వాలని చైర్మన్ కోరారు. అవపరమైన మౌళిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మోకాలిమార్పిడి తదితర శస్త్రచికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యతగా ఉండేవాటిని ఎంపిక చేసి, మన దేశ ధరలకు అనుగుణంగా సేకరించాలని సూచించారు. టిటిడి ఇఒ శ్యామలరావు మాట్లాడుతూ తిరుపతిలో (Tirupati) ని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలకు దాతలు విరాళం ఇచ్చే ఆపన్నహృదయం పథకం ఉందని, దీనిలాగే బర్డ్తో కూడా పేదవర్గాల వారికి శస్త్రచికిత్సలు చేసేందుకు దాతలు నుండి విరాళాలు సేకరించాలని జెఇఒ, ఎఫ్ఎసిఎఒకు సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్ర చాలా పురాతనమైనది. ఇది కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నివాసంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల కొండలపై ఉన్న ఈ ఆలయం, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.
తిరుమల ఆలయం ఎప్పుడు నిర్మించారు?
ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో సా. శ. 300 లో ప్రారంభమైందని నమ్ముతారు.
Read hindi news: hindi.vaartha.com