తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, టీటీడీ డాలర్ల ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లకు ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్లను మూసివేశారు.
Read Also:Sammakka Saralamma: నేటితో ముగియనున్న మేడారం జాతర

వారానికి ఒకసారి ధరల సవరణే నష్టానికి కారణం
టీటీడీ(TTD) నిబంధనల ప్రకారం బంగారం, వెండి డాలర్ల ధరలను వారానికి ఒకసారి మాత్రమే సవరించటం ఆనవాయితీ. అయితే బులియన్ మార్కెట్‌లో ధరలు రోజువారీగా మారుతుండటంతో, ఈ ధరల వ్యత్యాసం టీటీడీకి ఆర్థిక భారంగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన భక్తులు ముఖ్యంగా 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్ల కొనుగోళ్లకు అధిక ఆసక్తి చూపడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.
కొత్త విధానం దిశగా టీటీడీ యోచన
ఈ నష్టాలను నివారించడంతో పాటు విక్రయాల్లో స్పష్టత తీసుకురావడానికి టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ డాలర్ల ధరలను నిర్ణయించి విక్రయించే అవకాశముంది. అలాగే, శ్రీవారి దర్శన టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక్క డాలర్ చొప్పున విక్రయించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రూ.50 వేలకుపైగా కొనుగోలు చేసే సందర్భాల్లో పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కొత్త విధానాన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో అమల్లోకి తీసుకువచ్చి, బంగారం–వెండి డాలర్ల విక్రయాలను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: