తిరుమలలో అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలు వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు మెట్ల పై కష్టపడి నడుస్తున్నప్పుడు ఏ అనారోగ్య సమస్యలు వస్తే, తక్షణమే వైద్య సహాయం అందించడం దీని ప్రధాన లక్ష్యం.
CBN: ఎన్టీఆర్ ట్రస్టు సేవలకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

TTD
ఈ కేంద్రంలో టీటీడీ, Apollo Hospitals వైద్యులు మరియు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం భక్తులకు సేవలు అందిస్తారు. ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం, అనారోగ్య పరిస్థితులకి తక్షణ స్పందన, మరియు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రం ప్రారంభంతో భక్తుల విశ్రాంతి, ఆరోగ్యం మరింత రక్షితమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: