తిరుపతి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. బుదవారం జరిగిన కార్యక్రమం సందర్భంగా తిరుపతి (Tirupati) డిపో మేనేజర్ కే. సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రమాదాలకు కారణమైన, బస్సు ల డ్యామేజ్ చేసిన డ్రైవర్స్ ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగినది. ప్రమాదాలు జరిగిన తరువాత ఎదురయ్యే పరిణామాలు, నష్టాలు వాటి గురించి వివరంగా వారి కుటుంబ సభ్యులకు తెలియాజేశారు. డ్యూటీలకు వచ్చే డ్రైవర్లు మనసు ప్రశాంతంగా పెట్టుకుని, డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Read also: Satya Sai District: పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామస్తులు

Road safety awareness month celebrations at the RTC depot
వాహనాలు, పాదచారులతో బాటు ఇతర రోడ్డు వాడుకదారులను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేస్తూ, మిగిలిన సర్వీసు అంతా ఎటువంటి ఆక్సిడెంట్లు జరగకుండా, సంస్థకు మరియు ఇతరులకు ఎటువంటి నష్టం జరగకుండా, మంచి డ్రైవింగ్ పద్ధతులతో తిరుపతి డిపోను ప్రమాద రహిత డిపోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇంచార్జ్ ,మెకానికల్ ఇన్చార్జి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: