తిరుపతి (Tirupati) లో భక్తుల రాకపోకలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇంత భారీగా వచ్చే సందర్శకులను సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన మౌలిక వసతులు అత్యవసరమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త బస్ స్టేషన్ (బస్ టెర్మినల్) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లు భక్తుల ఒత్తిడిని భరించలేని పరిస్థితి నెలకొంది. రోజుకు లక్షలాది మంది రాకపోకలు సాగుతుండటంతో సదుపాయాలు తగినంతగా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ముందడుగు వేశారు. తిరుపతి నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బస్ టెర్మినల్ (New bus terminal) నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ బస్ స్టేషన్‌లో ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు.
బస్‌స్టేషన్లు ఆధునీకరించాలని
ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC), నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లు ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తిరుపతిలో నిర్మించే అత్యాధునిక బస్ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉండాలని చంద్రబాబు సూచించారు.

తిరుపతి బస్ స్టేషన్ కోసం అధికారులు రూపొందించిన ఐదు మోడళ్లను చంద్రబాబు ఆదివారం పరిశీలించారు. వీటిని మరింత అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం భాగస్వామ్యులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.మరోవైపు ఇకపై ఎలక్ట్రికల్ బస్సు (Electrical bus) లను మాత్రమే కొనుగోలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో కొత్తగా నిర్మించే బస్‌స్టేషన్‌లో ఛార్జింగ్ సదుపాయాలు ఉండాలని చంద్రబాబు సూచించారు.
మాల్స్ ఉండేలా డిజైన్లు రూపొందించాలని
అలాగే ఒకేసారి 150 బస్సులు నిలిపేలా బస్ బే నిర్మించాలని ఆదేశించారు. రెండ్ బస్ ఎంట్రీలు, ఎగ్జిట్లు ఉండాలని సూచించారు.హెలిప్యాడ్, రోప్ వే సౌకర్యాలతో పాటుగా బస్ స్టేషన్‌లో మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్ ఉండేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. తిరుపతిలో కొత్తగా నిర్మించే బస్ స్టేషన్‌లో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని.. దీని సాయంతో బస్ స్టేషన్‌కు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: