ఈరోజు ఉదయం ఏడు గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస ఆధ్వర్యంలో తిరుపతి (Tirupati) ఖాదీ కాలనీ నందు రోడ్డుపై గల సుమారు 200 మంది పేదలకు (poor Poverty), కుష్టి రోగులకు ఉచితంగా దుప్పట్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ శీతాకాలం దృష్టిలో ఉంచుకొని అనాధలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక లయన్స్ క్లబ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేదలను ఆర్తులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గొప్ప సేవా సంస్థని పేర్కొన్నారు.
Read Also: AP: ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు
రాబోయే రోజుల్లో పేదలకు మరింత సేవ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తరువాత లయన్స్ క్లబ్ ఆఫ్ (Tirupati) తిరుపతి శ్రీనివాస కోశాధికారి జగన్నాధం గారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెల సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, జగన్నాథం, కె ఆర్ శంకర్, బాసికార్ల రఘు, లోహిత్ తదితరులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: