వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల (Tirumala) లో భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే ఈ పవిత్ర ఉత్సవం కోసం దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నేటి అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
Read Also: Nirmala Sitharaman : దత్తత గ్రామంలో నిర్మలమ్మ పర్యటన

(Tirumala) అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30AMకు VIP బ్రేక్ దర్శనాలు, తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: