సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ(TTD) హిందూ దేవాలయాలకు వివిధ వస్తువులను రాయితీతో(Tirumala) అందించనుంది. వీటిలో మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి, పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఉద్యోగాలు మరియు ఆలయ కమిటీల ద్వారా డీడీతో కూడిన దరఖాస్తులను The Executive Officer, TTD Administrative Building, KT Road, Tirupati అనే చిరునామాకు పంపాలి.
Read also: AP: గోదావరి పుష్కరాలకు రూ.3వేల కోట్లు?

ప్రత్యేక రాయితీలు
గొడుగులు : కోసం రూ.14,500 విలువ గల గొడుగును 50% రాయితీతో రూ.7,250 చెల్లించి పొందవచ్చు. దరఖాస్తు పత్రాలతో పాటు స్థానిక సిఫార్సు, ఆలయ ఫోటో, ఆధార్ కార్డును జత చేయాలి.
శేషవస్త్రం : కోసం, టీటీడీ ఉచితంగా అందిస్తోంది. దీనికి డీడీ అవసరం లేదు. సంబంధిత తహసీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్ సిఫార్సు, ఆలయ ఫోటో, ఆధార్ కార్డుతో దరఖాస్తు చేయాలి.
రాతి- పంచలోహ విగ్రహాలు : ప్రత్యేక సబ్సిడీలు ఉన్నాయి. (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలు 5 అడుగుల లోపు ఉచితం. ఇతర రాతి విగ్రహాలకు 75% సబ్సిడీ, పంచలోహ విగ్రహాలకు 90% సబ్సిడీ (ఎస్సీ/ఎస్టీలు), 75% సబ్సిడీ (ఇతర వర్గాలు) అందిస్తుంది. దరఖాస్తుకు ఆలయ అభ్యర్థన లేఖ, తహసీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్ సిఫార్సు, ఆలయ బ్లూఫ్రింట్, విగ్రహ డ్రాయింగ్, ఫోటో, ఆధార్ కార్డు జత చేయాలి. విద్యాసంస్థలు సరస్వతీ దేవీ రాతి విగ్రహానికి 50% సబ్సిడీ పొందవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: