हिन्दी | Epaper

Tirumala: మరోసారి శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం

Sharanya
Tirumala: మరోసారి శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం

తిరుమల (Tirumala) తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత (Leopard) సంచరించిందని ఆదివారం ఉదయం పలు మీడియాలో వచ్చిన వార్తలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని అటవీశాఖ అధికారులు తేల్చిచెప్పారు. భద్రతా సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ అధికారులు సంయమనం పాటిస్తూ పరిస్థితిని నియంత్రించగా, భక్తులు యథావిధిగా స్వామివారి దర్శనానికి కొనసాగుతున్నారని తెలిపారు.

చిరుత కలకలం ఎలా మొదలైంది?
శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తిరుమల శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని వార్త కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గం 500వ మెట్టు దగ్గర చెట్లపొదల్లో సేద తీరుతున్న చిరుతను చూశామంటూ భక్తులు సమీపంలోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, శ్రీవారి మెట్టు మొదట్లో చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులను అనుమతించిన అధికారులు. సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వార్త అవాస్తవం అంటున్నారు అధికారులు.

అధికారుల తక్షణ చర్యలు
శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం తప్పుడు సమాచారంగా తేల్చారు. ఆదివారం ఉదయం ఎటువంటి చిరుత కనిపించలేదు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. దర్శనాలు యథావిధిగా జరుగుతున్నాయి. శనివారం మాత్రమే చిరుత శిలాతోరణం వద్ద కనిపించిందన్న సమాచారం ఉంది. అది వెంటనే అడవిలోకి వెళ్లిపోయిందిని పేర్కొన్నారు.

Read also: Nara Lokesh: వైసీపీ పై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో కీలక మార్పులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870