కియోస్క్ యంత్రాలు, క్యూఆర్ కోడ్స్ – టిటిడి ఇఒ ఎకె సింఘాల్
తిరుమల : తిరుమల(Tirumala) కొండపై అమలవుతున్న తరహాలో టిటిడి(TTD) పరిధిలోని 60 స్థానిక ఆలయాల్లో భక్తులు సులభతరంగా యూపిఐ ద్వారా నగదు చెల్లింపులు చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు టిటిడి 22 అనిల్కుమార్సింఘాల్ తెలిపారు. ఇందుకు అవసరమైన కియోస్క్్యంత్రాలు, క్యూఆర్ కోడ్స్ సా స్కానర్లు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కర్నాటక బెలగావిలో ఆలయం నిర్మాణం, బీహార్లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఆయా రాష్ట్ర అధికారులతో సంప్రదించి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
Read also: R. Krishnaiah: చట్టసభల్లో ఒబిసి రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం

అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు టిటిడి ఇఒ ఆదేశాలు
సోమవారం టిటిడి(Tirumala) పరిపాలన భవనంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, సివిఎసీ కెవి మురళీకృష్ణ, ఎపిసిఎఒ బాలాజీ, సిఇ సత్యనారాయణ, డిప్యూటీ సిఎఫ్ ఫణికుమార్నాయుడు, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, రవాణాజిఎం శేషారెడ్డితో కలసి ఇఒ సింఘాల్ పలు అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో టిటిడి నిర్మించదలచని ఐదువేల ఆలయాలకు అసవరమైన రెండు మూడు డిజైన్లు సిద్ధంచేయాలని సిఇని ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలని ఇఒ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉన్న కదిలే వంతెన మరమ్మతు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిచేయాలన్నారు. ముంబైలోని బాంద్రాలో ఆలయంలో జెఇఒ, సిఇ సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇఒ సింఘాల్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: