हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Tirumala Laddu case: ఈడీ రంగప్రవేశంతో తేలనున్న ‘కల్తీ’ పాపం

Tejaswini Y
Tirumala Laddu case: ఈడీ రంగప్రవేశంతో తేలనున్న ‘కల్తీ’ పాపం

Tirumala Laddu case : తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి రసాయనాలు కలిపిన నూనె, ఇతర శాఖాహారపదార్థాలతో కల్తీచేసిన నెయ్యిని సరఫరా చేశారని తేల్చిన సిబిఐ సిట్ అధికారులు నివేదికలతో అవినీతిని నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ అధికారులు విజయవాడ, తిరుపతి ప్రధాన కేంద్రంగా చేతిలో ఉన్న నివేదికలు, ఆధారాలతో మరింత లోతుగా కీలక వ్యక్తులను దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో 237కోట్ల రూపాయలు వరకు అవినీతి జరిగిందనేది సిట్ అందించిన నివేదిక. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది. ఎంత మొత్తంలో ఎవరెవరి నుండి ఎవరికి చేరిందనే పూర్తి ఆధారాలతో ఈడీ తేల్చితే అసలు దోషులు ఎవరనేది వెలుగుచూడనుందనేది టిటిడిలో గుప్పుమంటోంది.

Read Also: Andhra Pradesh: ‘భూముల’బిల్లుకు కేబినెట్ ఓకే

Tirumala Laddu case: The sin of 'adulteration' will be exposed with the entry of ED
Tirumala Laddu case: The sin of ‘adulteration’ will be exposed with the entry of ED

చేపట్టి లడ్డూప్రసాదాల కల్తీనెయ్యి వాడకం

ఇప్పటికే ఏడాదిన్నర కాలంలో సిబిఐ సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని కోణాల్లో కీలక విచారణ చేపట్టి లడ్డూప్రసాదాల కల్తీనెయ్యి వాడకంపై పాత్రధారులను 36మందిని గుర్తించింది. ఇందులో 11మంది టిటిడి అధికారులే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ కేసులో మరో ప్రధాన సూత్ర ధారి, టిటిడి ఎఫ్ఎసిఎఒ ఓ. బాలాజీ పాత్ర కూడా ఉందని సిట్ అందించిన నివేదిక. ఆయన ఇప్పటికే లబ్ధి దీర్ఘకాలిక సెలవు పెటే శారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే ఆయనకు సెలవు మంజూరు చేసిన అధికారు లెవరనేది ఇప్పుడు సంచలనమే. ఆయన దేశం తప్పించుకోకుండా చూడాలని రాజకీయ వర్గాలు హెచ్చరించాయి.

పనితీరుపై పలురకాల ఆరోపణలు

గత టిటిడి బోర్డు పెద్దలు, గత అధికారుల పనితీరుపై పలురకాల ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో వారందరినీ ఇడి పిలిచి సమగ్ర దర్యాప్తు చేయనున్నారనేది గుప్పు మంటోంది. ఇదే జరిగితే అరెస్టుల వరకు కూడా ఇడి వెనుకంజవేయదనేది గుప్పుమం టోంది. లడ్డూల తయారీకి ఐదుమంది కాంట్రా క్టర్లు టెండర్లలో దక్కించుకున్న ఒప్పందం ప్రకా రం సరఫరా చేయాల్సిన నాణ్యతప్రమా ణాలతో నెయ్యికి బదులు నాసిరకంగా, జంతు వుల కొవ్వునూనె కలిపారనేది తేల్చిన సిబిఐ. దేవుని లడ్డుల తయారీలో కల్తీనెయ్యితో గత వైసిపి ప్రభుత్వం, అప్పటి టిటిడి బో ర్డు పెద్దలు, టిటిడి అధికారులు అప నెయ్యి ఘటనపై టెండర్లు కేటా యించినప్పటినుండి నెయ్యి సరఫరా చేసిన రోజుల వరకు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు.

ఇంకా ఈ అవినీతి మరకల్లో అసలు దోషులు ఎవరనేది రాబడుతున్నారు. కీలకంగా మారిన ఈ కేసులో రానున్న రోజుల్లో ఎలాంటి సంచనాలు ఉండబోతోందనేది గుబులు రేకెత్తి స్తోంది.. ఇదిలా ఉండగా లడ్డూల తయారీకి సం బంధించి అవసరమైన నెయ్యిసరఫరాలో 2019వ సంవత్సరం నుండి 2024వరకు భారీగా కుట్రలు జరిగాయనేది సిఐబి సిట్(CIB SIT) అధికారులు కూడా నిగ్గుతేల్చారు. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రూర్కే బోలేబాబాడైరీ కంపెనీ నెయ్యిసరఫరా చేసేందుకు 2022లో కూడా సిద్ధమైంది. అయితే టిటిడికి నెయ్యి సరఫరాచేసే డైరీ నుండి కిలోకు 25 రూపాయలు కమీషన్ తీసుకున్నారనేదిఆధారాలు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870