తిరుమల : కృత్రిమమేధస్సుతో (ఎఐ) వేంకటేశ్వరస్వామి దర్శనం (Tirumala Darshan) సామాన్యభక్తులకు మూడు నాలుగుగంటల్లోనే చేయించాలనుకోవడం సంభవమేనా?! ఆలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదికాదా?? అనే ప్రశ్నలు ఇప్పుడు టిటిడి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్నటి వరకు ఎఐ సాంకేతిక వినియోగిం టిటిడి పాలక చుకోవడంలో మండలి, అధికారులు గూగుల్, టిసిఎస్ సహకారం కోరామని, దశలవారీగా ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాల్సి ఉందని ప్రకటనచేశారు. దీనికి తాజాగా ఆదివారం ఉదయం తిరుమ లలో టిటిడి మాజీ ఇఒ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం వ్యాఖ్యలు టిటిడిని ఇరకాటంలో పడేశాయనేది భక్తుల్లో ఆలోచన. కృత్రిమ మేధస్సు ను(ఎఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించినా ఆలయం లోపల దర్శన పరిమితులు ఉన్నాయని అనుభవ పూర్వకమైన వాదన వినిపించారు.
ఇదే సమయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచనలతో కూడిన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు ఎఐతో గంట, రెండుగంటల్లోనే శ్రీవారిదర్శనాన్ని చేయిస్తామన్న విధానాన్ని విరమిం చుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే కొందరు భక్తుల సంభాషణను విన్నానని, రెండు మూడు గంటల్లోనే దేవుని దర్శనం చేయిస్తామని ఆలోచన విధానం గురించి వారు చర్చించారన్నారు. ఇదీ ఆలయంలోపల అమలుచేయడం సాధ్యంకానిదని అన్నారు. టిటిడి ఈ ఆలోచనలకు స్వస్తిపలకాలని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో రోజుకు లక్షమంది వరకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. సరాసరి 70-80 వేలమందివరకు మాత్రమే ఆలయం లోపల జయలఘుల వరకే మహాలఘు దర్శనం చేయించగలుగుతున్నారు.
గంటకు 4,500 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పి స్తున్నా మరీ అంతకుమించి భక్తులకు క్షణకాలంకూడా దర్శనం చేయించలేక పోతార నేది వినిపిస్తున్న వాదనలు, ఇప్పటికే ఆలయం లోపల బంగారు వాకిలిలో మహా లఘులో మూడువరుసలు విధానం అమలవుతున్నా ఎక్కడో కులశేఖరపడిదాటాక కొలువైన దేవదేవుడ్ని క్షణకాలం అటుచూసేలోపే సిబ్బంది, శ్రీవారిసేవకులు లాగేస్తుండటంతో భక్తులు సంతృప్తిచెందడంలేదు. తిరుమల ఆలయంలో ఉదయంవేళ ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు తప్ప మిగిలిన అన్ని రకాల దర్శనాలు మహాలఘువిధానమే అమలవుతోంది.
ప్రయోగాత్మకంలోనూ సందిగ్ధాలు! :
సామాన్యభక్తుడికి మూడుగంటల్లోనే వేంకటేశ్వర స్వామి దర్శనం చేయించే విషయం ఎలాఉన్నా గత ఏడాదికాలంగా ఎఐ అమలుపై కసరత్తు చేస్తూనే ఉన్నారు. పైగా ఈ విధానం ప్రస్తుతం విదేశాల్లో అమలుచేస్తున్న గూగుల్, టిసిఎస్ సంస్థల సహకారం కోరినా తిరుమలలో తొలుత ప్రయోగాత్మక అమలులోనూ సందిగ్ధాలు ఎదురయ్యాయి. ఓ దశలో దీన్ని అమలుచేయడం కష్టమని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సంస్థలు వ్యక్తంచేశాయి.

దీంతో పాలకమండలి, టిటిడి అధికారులు కూడా ప్రత్యామ్నాయంగా అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నెలకొల్పి సకల సౌకర్యాలు కల్పించాలనే నిర్ణయంతో కార్యాచరణ మొదలుపెట్టారు. దేశం నలుమూలల నుండేగాక విదేశాల నుండి విచ్చేస్తున్న భక్తులకు వసతి, దర్శన సదుపాయాలు మరింత సులభం చేయడానికి వీలుగా తిరుపతి అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు సిద్దమవుతోంది. సుమారు 15హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడే భక్తులకు వసతి సౌకర్యంతో బాటు దర్శన టిక్కెట్లు, టోకెన్లు జారీచేసే కౌంటర్ల ఏర్పాటు జరగనుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో 40 వేలమంది భక్తులు దాటితే ఇక క్యూలైన్లు చాంతాండంత దూరం వ్యాపించడం, సర్వదర్శనానికి వారాంతం, రద్దీరోజుల్లో 24గంటల నుండి 30 గంటలు నిరీక్షించాల్సి న పరిస్థితులు వున్నాయి. ఏడుకొండలస్వామి క్షణకాల దర్శనమ్ సామాన్యభక్తుడికి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశ్యం టిటిడి పాలకమండలి చైర్మన్తోబాటు టిటిడి ఇఒ, అదనపు ఇఒల ఆలోచన. ప్రతి భక్తుడు గోవిందుని దర్శనానంతరం తిరుగుప్రయాణంలో సంతోషంగా వెళ్లాలనే ఆలోచన అధికారుల్లో బలంగా వ్యక్తమవుతోంది.
అన్నిరోజుల్లోనూ సుమారుగా 30 వేలమందివరకు ఎలాంటి టిక్కెట్లు, టోకెన్లు లేకుండా సాధారణ సర్వదర్శనమ్లోనే స్వామివారిని దర్శనం చేసుకొంటున్నారు. ఈ నేపధ్యంలో రోజువారీగా 80వేలమంది భక్తులకు తిరుమలేశుని దర్శనమ్ చేయించే అవకాశం కలుగుతోంది. మిగిలిన మరో 30-40వేలమందిభక్తులు వైకుంఠమ్ 2క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లలోనో, వెలుపల క్యూలైన్లలోనిరీక్షణ తప్పడం లేదు. రెట్టింపవుతున్న భక్తులకు సకాలంలో కిలోమీటర్లు క్యూలైన్లలోగాక మరో వైకుంఠమ్ 3 కాంప్లెక్స్ నిర్మించి సౌకర్యాలు కల్పించడమే మంచిదనే సూచనలు చేస్తున్నారు.
READ MORE :