పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ప్రవర్తిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లితుంది. అలాగని నిత్యం వారిని కనిపెట్టుకుని ఉండలేం. కానీ వంటగదిలాంటి ప్రమాదస్థలాల్లో మాత్రం పిల్లలు అటువైపు రాకుండా చూసుకోవాలి. వంటగదులు పిల్లలకు అతి ప్రమాదకరస్థలం. ఒంటగదిలోకి వచ్చిన ఓ చిన్నారి పాలగిన్నెలో పడి మరణించింది. దీనికి సంబంధంచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ లో వేడి పాలగిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి లక్షిత అనే బాలిక మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫటేజ్(CCTV Phootage) బయటకు ఆవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కృష్ణవేణి అనే మహిళ తన మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి విధులు నిర్వహిస్తోంది. చిన్నారి అక్షిత ఆడుంకుంటూ వంట గదిలోకి వెళ్లింది.
Hyderabad rain : హైదరాబాద్ కి వర్షము ముప్పు
చికిత్స పొందుతూ మరణించిన చిన్నారి
విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వవేడిపాలను చల్లబరచడానికి వంటగదిలో ఫ్యాన్ కింద గిన్నెలో పెట్టారు. ఆడుకుంటూ వెళ్లిన అక్షత ప్రమాదవశాత్తు ఆ వవేడి పాల గిన్నెలలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అరుపులు విన్న తల్లి వెంటనే అక్కడికి చేరుకుని బయటకు తీసింది. వవెంటనే చిన్నారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి(Govt Hospital) తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అక్షిత ఈరోజు మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం
ఈ విషయం తెలుసుకున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలను డీసీవో జయలక్ష్మీ పరిశీలించారు. ఈ ఘటన పాఠశాల నిర్వహణలో భద్రతా లోపాలపై ప్రజల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?
పిల్లలను పర్యవేక్షణ లేకుండా వదిలేయడం, ఇంట్లో ఉన్న పాత్రలు లేదా నీటి గిన్నెలపై జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.
తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
చిన్నపిల్లలను ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంచాలి. ఇంట్లో ఉన్న నీటి బిందెలు, పాలగిన్నెలు లేదా పెద్ద పాత్రలను మూతపెట్టాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: