ధర్మవరం ( సత్యసాయి జిల్లా )Terrorism : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద అనుమానితుల అరెస్టు (Arrest) ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. కేంద్ర నిఘా సంస్థల ఆధారాలు, స్థానిక పోలీసుల అప్రమత్తతతో ఈ అరెస్టులు జరిగినట్టు తెలిపారు. ఉగ్రవాద సంబంధాలున్న అనుమానితుడి అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణం ఉన్న అవకాశాన్ని విస్మరించలేమని పేర్కొంటూ, ధర్మవరంలో ప్రశాంతతను చెడగొట్టే అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మవరం శాంతియుత వాతావరణాన్ని భంగపరచేయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రవాద మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాయని. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, (People should stay calm) అలజడులకు తావివ్వకూడదని విజప్తి చేశారు.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారిక నిఘా సంస్థల నివేదికల ద్వారా త్వరలో వెలుగులోకి వస్తాయని. అప్పటి వరకు ఊహాగానాలకు తావివ్వకుండా, సహనంతో ఉండాలని ప్రజ్నలదరినీ కోరారు. అంతేకాక, ధర్మ వరం ప్రజల భద్రత, సమాజంలో శాంతివా తావరణాన్ని కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు మంత్రి యాదవ్.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :