हिन्दी | Epaper

Telangana: పార్టీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

Anusha
Telangana: పార్టీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

తెలంగాణ (Telangana) గడ్డపై జనసేన పార్టీ తొలి విజయానికి సంబంధించిన ఫలితాలపై పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భవించిన తెలంగాణ నేలపై తొలి అడుగు పడిందని అన్నారు..న ల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14 వార్డులో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్‌లో అగ్గు సాగర్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ ఫలితాలపై స్పందించారు. ప్రారంభంలో పార్టీ ఏ విధంగా ఉందో ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ తొలినాళ్లను గుర్తు చేసుకుంటే దారంతా గతుకులు, భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉండేదని అన్నారు.

Read Also: Mancherial: వేలాల గుట్టపై మహాశివరాత్రి జాతర సందడి

Telangana: Pawan Kalyan recalls the early days of the party
Telangana: Pawan Kalyan recalls the early days of the party

ప్రస్థానానికి బలమైన స్ఫూర్తి

చిన్నపాటి ఆసరా కూడా లేదని, అయినప్పటికీ ఏదో కొద్దిగా ఆశ ఉండేదని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన వీరమహిళలు ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తిని నింపుకుని ఉద్యమ స్ఫూర్తితో జనసైనికులు ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు సన్నద్ధమయ్యారని అన్నారు. తెలంగాణలో 332 చోట్ల పోటీ చేశామని, ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ స్థానం తమకు దక్కాయని అన్నారు.

మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరను చీల్చుకుంటూ మొలక వేస్తుందని అన్నారు. విశ్వవిజేత కూడా తల్లి కడుపులో అణువంతే ఉంటాడని అన్నారు. కోటి రతనాల తెలంగాణ (Telangana) లో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైందని, ఇప్పుడు తాము సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

మైలవరం పెళ్లిలో హైడ్రామా

మైలవరం పెళ్లిలో హైడ్రామా

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870