ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి (79) కన్నుమూయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద లోటుగా మిగిలిపోయింది. ఆదివారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే పోలవరం (డి) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి, దశాబ్దాల పాటు ప్రజల గొంతుకగా నిలిచిన ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tamballapalle: ఇవాళ కోర్టులో హాజరు కానున్న జోగి రమేశ్
రత్నాబాయి రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. 1972లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం (ప్రస్తుతం రంపచోడవరం) నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా ఆమె తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, 2008లో రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. అనంతరం 2014 నుండి 2020 వరకు శాసనమండలి సభ్యురాలిగా (MLC) సేవలందించి, గిరిజన సమస్యలపై నిరంతరం పోరాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా మూడు వేర్వేరు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అరుదైన గౌరవం ఆమెకు దక్కింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ మరో కీలక నేతను కూడా కోల్పోయింది. బీసీ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (93) కూడా అనారోగ్య సమస్యలతో విజయవాడలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఒకేసారి ఇద్దరు అనుభవజ్ఞులైన నేతలు కన్నుమూయడం తీరని లోటు. రత్నాబాయి గిరిజనుల హక్కుల కోసం, ఐలాపురం వెంకయ్య బీసీ వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి చిరస్మరణీయం. వీరిద్దరి మరణ వార్త తెలిసిన వెంటనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com