Sunitha Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) లోతుగా విచారణ చేపట్టలేదని, కీలక ఆధారాలను కూడా పట్టించుకోలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం వైఎస్ వివేకానంద రెడ్డి 7వ వర్ధంతి -సందర్భంగా పులివెందుల పట్టణంలోని వివేకా -సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు ఆర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో సునీతరెడ్డి తన తండ్రి హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు.
Read Also: Potti Sreeramulu Statue: అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!

సిబిఐ దర్యాప్తుపై సునీతారెడ్డి అసంతృప్తి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హత్య కేసులో కీలక నిందితులపై తాను కులుమార్లు వివరాలు చెప్పినా సిబిఐ వాటిని సీరియస్ గా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు ముందు, తరువాత నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, సందేశాలు చాలా కీలకమని, ముఖ్యంగా కిరణ్ యాదవ్ హత్యకు ముందు మరియు తర్వాత అనేక మందితో ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సాక్షి పత్రికలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని వార్త రావడానికి ఒక నిమిషం ముందు కిరణ్ యాదవ్కు అర్జున్ రెడ్డి మెసేజ్ పంపినట్లు తాను సిబిఐకి వివరాలు అందజేసినప్పటికీ వాటిపై సరైన విచారణ జరగలేదన్నారు. కిరణ్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ను రాసుకుని వచ్చారని మాత్రమే భావించి సిబిఐ విచారణ ముగించిందని, నిందితుల మధ్య హత్య అనంతరం జరిగిన ఫోన్ కాల్స్, మెసేజ్లను కూడా సమ గ్రంగా పరిశీలించలేదని ఆరోపించారు.
అందరూ మాకు అన్యాయం చేశారని ఆవేదన
ఈ కేసులో మరిన్ని ఆధారాలు సమర్పించాలని కోరి నప్పుడు తన వద్ద ఉన్న ఆదనపు ఆధారాలను కోర్టుకు, సిబిఐకి కూడా అందజేసినప్పటికీ వాటి పైనా విచారణ జరగలేదని సునీత పేర్కొన్నారు. కేసులో పూర్తి నిజాలు బయటపడాలంటే మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. తండ్రి హత్యకు న్యాయం కోసం తాను ఈ స్థాయిలో పోరాడుతున్నప్పటికీ ఇప్పటికీ న్యాయం జరగలేదని, అందరూ నాకు అన్యాయం చేశారని అయినప్పటికీ తన పోరాటం చివరి వరకు కొనసాగుతుందని సునీత రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: