हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?

Sharanya
Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?

గురువును దేవుడిగా పూజించే సంప్రదాయం మనకు ఉంది. అయితే ఈ నాటి సమాజంలో కొన్ని ఘటనలు ఆ విలువలకు విరుద్ధంగా చోటు చేసుకుంటూ, ఆ సంబంధాన్ని కల్మషితం చేస్తున్నాయి. ఇటువంటి ఘోర సంఘటనే ఇటీవల విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం-విశాఖ జాతీయ రహదారి సమీపంలో ఉన్న రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల విద్యా పరంగా కాకుండా, తల్లి తండ్రులాంటి గౌరవనీయ ఉపాధ్యాయునిపై మర్యాదలేని ప్రవర్తన జరిగింది. దీనికి కారణం ఒక విద్యార్థిని తన సెల్‌ఫోన్ తీసుకున్నారన్న కోపంతో అసహనానికి గురై, ఆగ్రహంతో లెక్చరర్‌పై చెప్పుతో దాడికి పాల్పడింది.

సంఘటన వివరాలు:

ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి తరగతి సమయంలో సెల్‌ఫోన్ వాడుతూ కనిపించగా, లెక్చరర్ నిబంధనల మేరకు ఫోన్‌ను తీసుకున్నారు. ఇది విద్యార్థినికి నచ్చక, లెక్చరర్‌పై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, చెప్పుతో కొట్టే స్థాయికి వెళ్లింది. ఇది చూసిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ ఘటనను మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే స్పందించి, దాడి చేస్తున్న విద్యార్థినిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా లెక్చరర్‌పై దాడిని కొనసాగించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వీడియో వైరల్ :

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటి విద్యార్థుల వల్లే గురువు గౌరవం తగ్గిపోతుంది, ఇతర విద్యార్థులపై నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది, డిజిప్లిన్ అనే పదం కాలేజీల్లో మరిచిపోతున్నారు అంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుంటే, ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో డిసిప్లిన్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు నిబంధనలు పాటించకపోవడం, సెల్‌ఫోన్ల వినియోగం, అసభ్య ప్రవర్తన మొదలైనవి అధికమవుతున్నాయి.

Read also: Sajjala Ramakrishna Reddy: వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870