हिन्दी | Epaper

Street dogs: వీధి కుక్కలకు బలైన నాలుగేళ్ళ బాలుడు

Sharanya
Street dogs: వీధి కుక్కలకు బలైన నాలుగేళ్ళ బాలుడు

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక పట్టణాల్లో వీధికుక్కల దాడుల ఘటనలు నిరంతరం నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరికొన్ని ప్రాంతాల్లో బాలికలపై దాడులు చోటు చేసుకున్నాయి. కానీ, ఈ దాడులపై శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలన్న పట్టుదల ప్రభుత్వాల్లో కనిపించడం లేదు. తాజాగా నంద్యాల జిల్లాలో స్వైర విహారం చేశాయి. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టి కరిచి పీక్కుతిన్నాయి. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ దారుణ ఘటన బేతంచెర్ల హనుమాన్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.

బేతంచెర్ల ఘటన

నంద్యాల జిల్లా బేతంచెర్ల హనుమాన్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ తాజా ఘటన ప్రజలలో తీవ్ర ఆవేదన రేపింది. నాలుగేళ్ల మోహిద్దీన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగానే, వీధికుక్కలు అతనిపై దాడి చేయడం, ప్రాణాల్ని తీసుకోవడం అత్యంత హృదయ విదారకం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. హనుమాన్‌నగర్‌ కాలనీలో హుస్సేన్‌ బాషా, ఆశ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే చిన్న కుమారుడు నాలుగేళ్ల మొహిద్దీన్‌ శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటి సమీపంలోనే వారిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో వీధి కుక్కల గుంపు వారిపై దాడికి యత్నించింది. దీంతో వారిద్దరూ పరుగెత్తారు. అయినప్పటికీ నాలుగు సంవత్సరాల మొహిద్దిన్.. శునకాల దాడికి గురయ్యాడు. శునకాలు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా రక్కేశాయి. దీంతో తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Accident: తమ చిన్నారులు టెన్త్ పాస్ అయ్యారని దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఘోర ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870