हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

TTD: నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల

sumalatha chinthakayala
TTD: నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్‌ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్‌‌ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.

నేడు శ్రీవారి అర్జిత సేవా

అంగప్రదక్షిణం టోకెన్లు

కాగా, ఆర్జిత సేవా టికెట్లు, జూన్‌ 9 నుంచి 11వరకూ జరిగే శ్రీవారి జ్యేష్టాభిషేకం టికెట్లు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ మార్చి 21న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునే టోకెన్ల కోటాను 22న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్‌

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మార్చి 24న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా, తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. పరీక్షల తరువాత వేసవి సెలవుల్లో ప్రతీ ఏటా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870