Srikalahasti Temple: శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యదనిర్వ హాణాధికారిగా రెవెన్యూశాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డెప్యూటి కలెక్టర్ బికె వెంకటేశు గురువారం ఉదయం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద బాధ్యతలు స్వీకరించారు. వైయస్ఆర్ కడపజిల్లా ముద్దనూరు గాలేరు నగరి సుజల శ్రవంతిలో పని చేస్తున్న ఆయనను ప్రభుత్వం శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారిగా నియమించింది.
Read Also: Vizianagaram Crime: పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

గురుదక్షిణామూర్తి సన్నిధిలో బాధ్యతలు
ఆయన బుధవారం రాత్రే శ్రీకాళహస్తి చేరుకొని దేవస్థానం అతిది గృహంలో కుటుంబ సభ్యులతో బస చేసారు. గురువారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో ప్రోటోకాల్ ఎఇఓ మోహన్ ఎపిఆర్ రవి సారధ్యంలో వేదపండితులతో స్వాగతం పలికారు. ఆయన స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం చేసుకున్న తరువాత ఆయనకు గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద వేదపండితుల వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందించారు. తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన బాధ్యతలు స్వీకరించటాని చాంబర్లో ఏర్పాట్లు చేసారు. అయితే ఇఓ తాను స్వామి సన్నిధానంలో గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: