హైదరాబాద్ :తెలుగురాష్ట్రాలలో ప్రత్యేక రైళ్లను(Special trains extension) అక్టోబరు 15 వరకు పొడగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రధాన మార్గాల్లో రద్దీ దృష్ట్యా 54రైళ్లు నడుస్తాయని వివరించారు.కాచిగూడ-మధురైతో పాటు తిరుపతి, నాగర్పోల్కు అందుబాటులో ఉంటాయన్నారు.అదేవిధంగా హైదరాబాద్-కొల్లాం,హైదరాబాద్-కన్యాకూమారి మార్గంలోరాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad -Tirupati) నడుమ10రైళ్లు,కాచిగూడ-నాగర్పోల్ రూట్లో 8రైళ్లు,నాందేడ్- తిరుపతికి 10 రైళ్లు,నాందేడ్-ధర్మవరంకు 10రైళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆరు ప్రధాన మార్గాల్లో 54ప్రత్యేక రైళ్లను అక్టోబరు15వరకు పొడగించారు. ఇక హైదరాబాద్- కొల్లాం వెళ్లే ప్రత్యేక రైలు ఆగస్టు16 నుంచి అక్టోబరు 11వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా హైదరాబాద్-కన్యాకుమారి ప్రత్యేకరైలు అక్టోబరు 8వరకు ప్రతి బుధవారం నడుస్తున్నట్లు వివరించారు.
Read Hindi News: hindi.vaartha.com
Read also: